18, మార్చి 2020, బుధవారం

master e.b.......ఇదిగో..కావలసినంత తీసుకో......సత్సంగము ::9.04

సాయి మాస్టర్ గార్లు సదా మనలను అందరినీ అనుగ్రహించా లని ప్రార్ధిస్తున్నాను..

From : Mannava Satyam
18/3/2020....I Pray to Sai Master to Bless us all with Good Health and success..
(62)....ఇదిగో..కావలసినంత తీసుకో......సత్సంగము ::9.04
https://youtu.be/coOlSmDRKuo
------------

మాస్టర్ ఇ.బి.
              "....'ఒక్కోసారి భలే నవ్వు వచ్చేది. దూరప్రయాణం కదా, బట్టలు మట్టికొట్టుకుపోయేవి. పైగా గడ్డం పెరిగివుండేది. అది రైల్లో ఒక అనుకూలతగా వుండేది. సీట్లలో హాయిగా కూర్చోడానికీ, ఒక్కోసారి పడుకోడానికీ కూడా వీలయ్యేది. అందరూ కొంతదూరంలో కూర్చునేవారు. ఏ జేబుదొంగో అనుకునేవారేమో, అనుమానంగా చూచేవారు. తమ సామాన్లు జాగ్రత్తగా పెట్టుకునేవారు' అని చెప్పసాగారు శ్రీ మాష్టర్.
       ఈ విషయాలు శ్రీ మాష్టర్ ద్వారా వింటుంటే నాకెంతో నవ్వు వచ్చింది. ఇంతలో ఎవరో అబ్బాయి ఒక పెద్ద పూలదండ తీసుకునివచ్చి మాష్టరుగారికి యిచ్చాడు. ఇంట్లో అప్పుడే కట్టి పంపినట్లుగా వుంది. పూలదండ యిచ్చి అతను వెళ్ళిపోయాడు. 
       ఆ పూలమాల చాలా తాజాగా, ఎంతో అందంగా వుంది. రెండు మూడు రకాల పూలు కలిపి కట్టారు. శ్రీ మాష్టర్ ఆ పూలమాల నా చేతికిచ్చి బాబాఫొటోకు వెయ్యమన్నారు. నేను శ్రీ మాష్టర్ చెప్పినట్లు బాబాఫొటోను పూలమాలతో అలంకరించి నమస్కరించుకున్నాను.
       'ఈ పూలమాల ప్రక్కగ్రామం నుంచి గోపాలయ్యగారని, వారు పంపారు. వాళ్ళ పాపకు సాయి అనుగ్రహం కలిగింది' అన్నారు శ్రీ మాష్టర్.
      'ఏం జరిగింది? ఎలా సాయిభక్తులయ్యారు?' అని అడిగాను నేను ఆతృతతో.
     శ్రీ మాష్టర్ చెప్పనారంభించారు - 'విజయకుమార్‌ అని నా విద్యార్థి, కొత్తపాలెం గ్రామం. క్రితంసారి వచ్చినప్పుడు నువ్వు అతన్ని చూచేవుంటావు. అతను సత్సంగానికి వస్తూవుంటాడు. సత్సంగం గురించీ, నా గురించీ వాళ్ళ యింట్లో వాళ్ళకు చెబుతూ వుండేవాడు. ఒకసారి కొత్తపాలెం రమ్మని నన్ను ఆహ్వానించాడు. శ్రీ గోపాలయ్య గారింట్లో సత్సంగం ఏర్పాటుచేశారు. 
       'కొత్తపాలెంలో సత్సంగంలో శ్రీసాయి గురించి చెబుతున్నాను. అందరూ ఎంతో శ్రద్ధతో విన్నారు. కాసేపు భజన చెప్పాను. ఇంతలో వాళ్ళ అమ్మవడిలో కూర్చున్న పాప పారాడుతూ నా దగ్గరకు వచ్చింది. దగ్గరకు తీసుకున్నాను. పాప ఏదో తేడాగా వుంది. అప్పుడు ఆ పాప గురించి వాళ్ళు నాకు అంతా చెప్పారు.
        ఆ పాప పేరు చి|| మల్లి. అప్పటికి 6 సం||లు. నెల్లూరు అమెరికన్ హాస్పటల్‌లో జన్మించింది. 14 వ రోజున యింటికి తీసుకువస్తున్నారు. నెల్లూరులో రైలు ఎక్కుతూ ప్లాట్‌ఫాంమీద నుంచుని రైలులోని మరో ఆమెకు పాపను అందిస్తోంది వాళ్ళ అమ్మగారు. పాపను ఎత్తుకుని రైలు ఎక్కటం కష్టమని, జాగ్రత్త కోసమని అలా చేసిందామె. ఆ జాగ్రత్తే శాపం అయింది. పొత్తిళ్ళలోని పాప జారిపోయింది. పాపను అందించే సమయంలో చేతుల్లోంచి జారి రైలుకూ, ప్లాట్‌ఫాంకూ మధ్యగల సందులోంచి కింద పడిపోయింది పాప. 14 రోజుల పసికందు. తలకు దెబ్బ తగిలింది. గూడూరులో రైలు దిగగానే డాక్టరు దగ్గరకు వెళ్ళారు. ఏదో వైద్యం చేశారాయన. పాప కోలుకుంది. పెరిగి పెద్దదవుతోంది. కానీ మాటలు రాలేదు, నడక రాలేదు. ఇదుగో, అలాగే పారాడుతూ వుంటుంది. ఇదంతా పాప గురించి వారు నాకు చెప్పారు'......"
   పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాష్టర్ గారి జీవితము - బోధలు
రచన : శ్రీ మన్నవ సత్యం

17, మార్చి 2020, మంగళవారం

OM SAI LIKHITA JAPAMU :: 100 LAKHS

సాయి మాస్టర్ గార్లు సదా మనలను అందరినీ అనుగ్రహించా లని ప్రార్ధిస్తున్నాను..


from mannava satyam : 17/3/2020, 10.30 pm. 
I pray to Sai Master to Bless us all...
Only the almighty Aayushu Arogya Iswarya pradata, paripurna Dattaava taara Shirdi Sai Nadh Prabhu can save any one and whole Universe with his kindness and divine love and power...
Let us pray Sai and Master to bless us all with good health and long lives to Serve Him more and more ...and get the benifit of Human Birth...
Sai Nath Maharaj ki jai..
---------------------------
and also I will share one of our satsanga members LIKHITA JAPA...is an inspiration to all of us...
what a devotion and Deeksha...
smt. Satyavathi..completed Likhita Japa of 100 lakshs....i.e.One Crore times she wrote Om Sai in Telugu and Marati....
I will share the photos and chat with you...
-------------------------------------------------

Satyavathi ...Guru ji   100  th  book completed  mee blessings  tho  koti  ayindi  swamy

 Great

 Thank you  swamy

 Send 100 th book photo
  photo and design.

I will  send  with  in 10 minutes  gurujj...

EVERY PAGE IS WITH VERY DEVOTED DESIGN
 వ్రాసిన నామము ఏమిటి...
 మరాఠీ లోనా..
 Avunu  guru ji marati  lo 50 books  telugulo
50  books  marati lo
 ఒక నామము పెద్ద అక్షరాలతో వ్రాసి ఫొటో తీసి పంపు...
 చాలా బాగుంది..
 షిర్డీ ఎప్పుడు వెళ్లావు మరి...
 100 బుక్స్ ఎన్ని నెలలు పట్టింది...
 సుమారు ...

 1997   February  nundi
 Before  two days .

 Shirdi  April  lo velthunna  swamy  Anni books  na chethone

 Great  Very great

Thank you  swamy

sailokam : పది మాటలకు ఒక్క మాట ....24 నమస్కార నామము ..one word for ten...

from mannava satyam : 17/3/2020, 
Subhodayam! I pray to Sai Master to Bless us all...
------------------------
పది మాటలకు ఒక్క మాట ....24 నమస్కార నామము ..one word for ten....8.17
https://youtu.be/CFz_QTcB394
----------------------------------------


సాయి మాస్టర్ గార్లు సదా మనలను అందరినీ అనుగ్రహించా లని ప్రార్ధిస్తున్నాను..
===================================================

ఆమెరికాలో పని చేస్తున్న మన తెలుగు వైద్యురాలు పంపిన మేసేజ్. "కరోనా వైరస్" - ప్రపంచ మహమ్మారి!

మొత్తం చదివే ఓపిక లేనివాళ్లకు ముఖ్యమైన విషయాలు ముందు:

- కరోనా వైరస్ కు ఎవరూ అతీతులు కారు. భారతీయులతో సహా! భారతీయులు 'ఎంత గొప్పవాళ్లో' కరోనా వైరస్ కి తెలియదు. Take it seriously!

- ఇప్పటి కరోనా వైరస్ పేరు severe acute respiratory syndrome coronavirus 2 (SARS-CoV-2). దీనితో వచ్చే వ్యాధిని coronavirus disease (COVID-19) అంటారు.

- COVID-19 కి వాక్సీన్ లేదు. వాక్సీన్ రావడానికి కనీసం ఒక సంవత్సరం పట్టొచ్చు.

- COVID-19 కి ట్రీట్మెంట్ లేదు. అన్ని దేశాల్లో రకరకాల HIV మందులు, ఇతర antivirals లాంటివి trial చేస్తున్నారు కాని ఇప్పటివరకు ఖచ్చితమైన treatment drugs లేవు.

- కొత్తగా ఉద్భవించిన వైరస్ కావడంతో ప్రపంచంలో ఎవరికీ ఈ వ్యాధి నుండి immunity లేదు. Epidemiologists అంచనాలా ప్రకారం దీనిని అదుపు చేయకపోతే ప్రపంచంలో సగం మంది కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అట్లా జరిగితే ఒక్క అమెరికాలోనే పది లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని వారి అంచనా.

- COVID-19 వల్ల వచ్చే symptoms ముఖ్యంగా పొడిదగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.

- COVID-19 రోగులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు respiratory droplets లో ఒకరినుండి ఒకరికి వ్యాపిస్తుంది. అందుకని వ్యాధి వచ్చినవాళ్లు ఇతరులకు సోకకుండా మాస్క్ వేస్కోవాలి.

- వైరస్ surfaces మీద 3 గంటల నుండి 3 రోజుల దాకా బతికి ఉండే అవకాశం ఉంది. అందుకే చేతులు కడుక్కోవడం, ముఖాన్ని చేతులతో ముట్టుకోకుండా ఉండడం చాలా అవసరం.

- COVID-19 వైరస్ కి expose అయినాక వ్యాధి లక్షణాలు (symptoms) ఎక్కువ శాతం 5 రోజుల్లో మొదలవుతాయి. అయితే 2-14 రోజుల్లో ఎప్పుడయినా symptoms మొదలవొచ్చు. అందుకే COVID-19 వ్యాధి వచ్చినవాళ్లతో contact లోకి వస్తే, లేదా అనుమానం ఉంటే 14 రోజులు అందరికీ దూరంగా (quarantine) ఉండాలి.

- మామూలుగా వచ్చే influenza (flu) కన్నా COVID-19 కనీసం పదింతలు ఎక్కువ ప్రాణాంతకమైనది.

- COVID-19 నుండి 80% మంది తేలికపాటి symptoms (దగ్గు, జ్వరం)తో కోలుకుంటారు. 10-20 శాతం మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. 2-3 % మంది ఈ వ్యాధితో చనిపోతారు. చనిపోయేది చాలామటుకు వృద్ధులు, గుండెజబ్బు, డయబీటీస్ వంటి వ్యాధులు ఉన్నవాళ్లు.

- దీనితో ప్రాణనష్టం తగ్గించడానికి చేయవలసింది 'social distancing'. అంటే మనుషులను isolate చేయడం, events cancel చేయడం, మనుషులు సమూహాల్లో, గుంపులుగా కలవకుండా నివారించడం.

- ఇది ఇప్పటివరకూ మనమెవరమూ చూసి ఎరగని పరిస్థితి. This is something our generation is going to remember!

-----------

నేను డాక్టర్ గా పోస్టులు పెట్టేది చాలా అరుదు. కరోనా వైరస్ గురించి చాలా మంది అజ్ఞానం చూస్తూ మాట్లాడకుండా ఉండలేక రాస్తున్నాను. చెప్పడం నా బాధ్యత కూడా! చెప్పాలంటే చాలా ఉంది కాని ఈ పోస్టులో ముఖ్యమైన విషయాలు రాసే ప్రయత్నం చేస్తాను.

నేను అమెరికాలో ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ గా పని చేస్తున్నాను. ప్రపంచంలో అత్యంత ఆధునికమైన వైద్య సదుపాయాలు ఉన్నయని చెప్పుకునే అమెరికాలో పరిస్థితికి ప్రత్యక్ష సాక్షిగా చెప్పే విషయాలు ఇవి.

రెండు వారాల క్రితం వాషింగ్టన్ లో మొదలై అన్ని రాష్ట్రాలకు పాకిన కరోనా వైరస్ అమెరికా ని ప్రస్తుతం అతలాకుతలం చేస్తుంది. రెండు వారాలుగా మన ప్లాన్ ఏంటి అని తర్జనబర్జనలు పడుతున్న మా క్లినిక్ లో మార్చ్ 12 న అన్ని healthcare systems లో లాగానే పెనుమార్పులు జరిగినయ్.

ముందు నుండే పరిస్థితి ని దగ్గరగా గమనించేవాళ్లకి అర్థమయినా మొదటిసారి స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి official notice లో వచ్చిన సమాచారం ఒక్కసారిగా అందరినీ ఒక్క కుదుపు కుదిపింది. తీవ్రమైన వ్యాధితో హాస్పిటల్ అడ్మిషన్ లు అవసరం ఉన్నవాళ్లను తప్ప కరోనావైరస్ టెస్ట్ చేయడానికి టెస్ట్ కిట్స్ లేవనేది దాని సారాంశం. అంటే కరోనా వైరస్ వచ్చిన వారిలో తేలికపాటి వ్యాధిలక్షణాలు (mild symptoms) ఉండే 80% మందిని టెస్ట్ చేయడానికి ఇప్పటికైతే లేదు. అంటే Covid-19 ఉన్న వాళ్లందరినీ గుర్తించి వేరు (isolate) చేసే అవకాశం లేదు. వాళ్లు యధావిధిగా వైరస్ ని వ్యాపిస్తూ పోతారు. అంటే ప్రస్తుతం న్యూస్ లో చెప్పే నంబర్లన్నీ అర్థం లేనివి. టెస్ట్లు లేకపోతే పాజిటివ్ లు లేవు కదా! అయితే కొద్ది రోజుల్లో ఎంతమందినైనా టెస్ట్ చేయగలిగే అన్ని టెస్టులు వస్తాయి. కానీ జరగాల్సిన నష్టం ఇప్పటికే చాలా జరిగిపోయింది. The horse has left the barn!

పేషెంట్లను గుర్తించి వారిని quarantine చేయలేని ఈ పరిస్థితుల్లో చేయగలిగింది ఒక్కటే. వైరస్ వ్యాప్తిని వీలయినంత తగ్గించడం. అది చేయగలిగింది 'social distancing' తో మాత్రమే. అంటే మనుషులను isolate చేయడం, events cancel చేయడం, మనుషులు సమూహాల్లో, గుంపులుగా కలవకుండా నివారించడం. ఇందులో ప్రభుత్వాలు ఏమి చేయాలి, వైద్య వ్యవస్థ ఏమి చేయాలి, ప్రజలు ఏమి చేయలి అనేది ఇంకో పెద్ద పోస్టు రాయొచ్చు. అయితే అందరూ వాళ్లు చేయాల్సింది చేయకపోతే ఈ వైరస్ వల్ల కలిగే ప్రాణ నష్టాన్ని అరికట్టే అవకాశం లేదు. We need all hands on deck!

వైరస్ సోకిన అందరినీ టెస్ట్ చేయలేమన్న కొత్త ఎరుకతో మా హాస్పిటల్ సిస్టం లో డాక్టర్లు, మేనేజర్లు, లీడర్షిప్ అందరూ అప్రమత్తమయ్యారు. మా క్లినిక్ లో ఇప్పుడు ప్రత్యక్షంగా పేషెంట్లను చూడడం ఆపేసినం. అత్యవసరమైన వైద్యసదుపాయాలు అవసరమైన వారిని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి పంపుతున్నాం. మిగిలిన వాళ్లతో ఫోన్ విజిట్స్ చేస్తున్నాం. Regular follow up విజిట్స్ అన్నీ రెండు నెలలు postpone చేస్తున్నాం.

ఇప్పుడున్న పెద్ద ప్రమాదం ఏమిటంటే వచ్చే రెండు వారాల్లో ఇక్కడి వైద్య వ్యవస్థ కరోనా వైరస్ రోగులను accommodate చేయలేక collapse అవడం. కరోనా వైరస్ రోగులు ఇప్పుడున్న data ని బట్టి ప్రతి ఆరు రోజులకు double అవుతారు. Experts అంచనాల ప్రకారం వచ్చే రెండు వారాల్లో కరోనా సోకిన వారి సంఖ్య ఈ దేశంలో లక్షల్లోకి చేరుతుంది. వైరస్ సోకిన ప్రతి వంద మందిలో 10-20 మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరమవుతుంది, తక్కువలో తక్కువ అందులో ఇద్దరు చనిపోతారు. అంటే పది లక్షల మందికి వైరస్ వస్తే, లక్ష మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతుంది, 20,000 మంది చనిపోతారు. అమెరికాలో సుమారు 45,000 ICU beds, 160,000 ventilators మాత్రమే ఉన్నాయి. రెండు మూడు వారాల్లో ఇక్కడి వైద్య వ్యవస్థ collapse అయ్యే అవకాశం ఉందని అంచనా! ఇటలీలో లాగా ఇక్కడ కూడా వైద్య సదుపాయాలు సరిపోక ఎవరికి ఆక్సిజెన్ ఇవ్వాలి, ఎవరిని ventilator మీద పెట్టాలి అని వైద్యులు చాలా కష్టమైన నిర్ణయాలు తీస్కుకోవాల్సి వస్తుంది. అంటే బతికించే అవకాశం ఉన్నా సదుపాయాలు లేక బతికించలేని పరిస్థితి. ఇటలీ వలె ఇక్కడ కూడా funeral homes నిరాకరిస్తే బంధువుల మురిగే శవాలతో ఇళ్లలో ఉండాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంది. అమెరికాలోని చాలామటుకు హాస్పిటల్ సిస్టంస్ లో ఒక వారం రోజులకన్నా ఎక్కువ సరిపడే మాస్కులు, గౌన్లు లేవని అంచనా! ఆ తర్వాత పరిస్థితి ఏమిటని ఆలోచిస్తేనే భయాందోళనలు కలిగించే పరిస్థితి.

అమెరికాలోనే పరిస్థితి ఇదయితే ఎక్కువ శాతం ప్రజలకు వైద్యసదుపాయాలు అందుబాటులో లేని ఇండియాలో ఏమి జరుగుతుందో ఊహించడం అంత కష్టం కాదు. అందరూ ఈ pandemic ని serious గా తీసుకోవాలని నా మనవి. ఇండియాలో ఉన్న మా అమ్మా నాన్నలకు అత్యవసరమైనతే తప్ప ఇంటి బయటకు వెళ్లొద్దని, ఎవరినీ కలవొద్దని చెప్పిన. ఈ వైరస్ నాకు సోకితే నేను కొంత జ్వరం, దగ్గులతో బాధ పడి కోలుకునే అవకాశాలు ఎక్కువ. కాని 60-70 వయసుల్లో ఉన్నవాళ్లు hospitalize అయే అవకాశం, చనిపోయే అవకాశం ఎక్కువ. Social distancing పాటించి high risk population అయిన older population ని, ఇతర వ్యాధులతో బాధపడుతూ immunity తక్కువ ఉన్న వాళ్లని కాపాడుకుందాం.

Let’s flatten the curve:

కరోనా వైరస్ ఇంఫెక్షన్ రాకున్నా బయటకు వెళ్లకుండా ఎందుకు ఉండాలి అనుకునేవాళ్లు ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. Social distancing పాటించకపోతే ఈ pandemic లో వైరస్ బారిన పడిన వాళ్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగి healthcare systems ని overload చేస్తుంది. ఆ పరిస్థిలో డాక్టర్లు, ICU beds, ventilators సరిపోక ప్రాణనష్టం ఎక్కువ జరుగుతుంది. Social distancing పాటించడం వల్ల ఒకేసారి ఎక్కువ మందికి వైరస్ సోకకుండా నివారించవచ్చు. తద్వారా వీలయినంత మందికి వైద్యం అందించే వీలు ఉంటుంది. pandemic curve ని flatten చేయడం ద్వారా వైరస్ బారిన పడేవారి సంఖ్య తగ్గకపోయినా దేశం లోని వైద్య వ్యవస్థ ఒకేసారి overload కాకుండా ఉంటుంది. ఇక్కడ పెట్టిన ఒక గ్రాఫ్ లో 'flattening the curve' అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

పైన చెప్పిన అంచనాలన్నింటినీ కొంతవరకైనా మార్చే అవకాశం ఉంది. అది మనందరి చేతుల్లో ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా, ఇతరులను కలవకుండా ఉండి వీలయినంత మంది ప్రాణాలను రక్షించుకుందాం!

- చైతన్య చెక్కిళ్ల, MD

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి