13, డిసెంబర్ 2018, గురువారం

13/12/2018 మన్నవ సత్యం నుండి : ఈ రోజు సందేశం :

ఓం సాయి మాస్టర్
 సాయి మాస్టర్ గార్లు సదా మనలను అందరినీ అనుగ్రహించా లని ప్రార్ధిస్తున్నాను..


13/12/2018 మన్నవ సత్యం నుండి : ఈ రోజు సందేశం : 
13/12/2018...మన్నవ సత్యం నుండి : ఓం సాయి మాస్టర్....సాయి మాస్టర్ గార్లు మనలను అందరిని అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నాను....
ఈ మాసము మార్గశిర మాసము కూడా దత్త స్వామి జన్మించిన మాసము అవటం వలన చాలా పవిత్రమైనది మనకు ఎంతో ముఖ్యమైనది....దత్త జయంతి 22 వ తేదీ...అప్పటివరకు దత్తావతార చరిత్రలు పారాయణ చేసుకుంటూ దత్తజయన్తి రోజు విశేష పూజ చేసుకోవాలి....
నేను రచించిన సాయి బాబా పూజ పుస్తకము లో వ్రాసిన 125 నామములు నుండి కొన్ని నామములు ఇంతకుముందు తెలిపాను....ఇప్పుడు మరికొన్ని.....ఇకనుంచి ప్రతిరోజు ఇవ్వగలను....
ఈ నామములు కు ముందు 'ఓం ' అనీ చివరన 'సాయి బాబా నమస్కారములు నమస్కారములు శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు...
(19) శిరిడి నివాస...(20) అవధూత..(21) స్ఫురద్రూప......
==============================
(22) వ నామము.....ఓం మహా జ్ఞాని సాయి బాబా నమస్కారములు నమస్కారములు...శ్రీ దత్త శ్రీ పాడుకాం శరణం ప్రపద్యే..సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు....ఈ నామము 19 సార్లకు తక్కువ కాకుండా వీలైతే 125 పర్యాయములు స్మరించవలెను...
=================================
(23)..నామ రూప రహిత.....(24) మిత భాషణ..... 

మిగతావి రేపటి సందేశము లో....


 ఈ క్రింది వెబ్ సైట్ ను కూడా వీక్షించండీ
 https://sailokam.blogspot.com/

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి