26, ఏప్రిల్ 2012, గురువారం

మానవుని మనస్సు ఎప్పుడు ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో, వారి గుణాలు మానవునిలో నాటుకుంటూ ఉంటాయి.

ఓం సాయి మాస్టర్  

మానవుని మనస్సు ఎప్పుడు ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో, వారి గుణాలు మానవునిలో నాటుకుంటూ ఉంటాయి.
అందుకే సకల సద్గుణ రాసి, సకల దైవగున సంపన్న్డు సాయిని తలచినంతసేపు ఆయనలోనే సద్గుణాలు మానవుని అంతఃకరణ లో  ప్రవేశిస్తూ ఉంటాయి.  
మానవాళిని మార్చడానికి ఇది ఏంటో సులభమైన మార్గము.
                                                                                                                                       -------మన్నవ సత్యం 


సాయి సత్చరిత్ర అమృత వాక్కులు.

''మనసు సారవంతమైన నేల. దానిని సాయి భక్తిజలం తో తడపాలి. అప్పుడు వైరాగ్యం అంకురిస్తుంది.  
జ్ఞానం వికసిస్తుంది. కైవల్యం అనే ఫలం లభిస్తుంది. బాబా వాక్యమే పారమానంద ప్రాప్తికి దారి  చూపిస్తింది. 
                                                                                                        (స.చ. అ: ౬ ఓవీలు: ౧-౪౦.)

ఒంటికి పొడుగైన లాల్చి,  తలకు గుడ్డ  కట్టుకుని ఒక దివ్యరూపము మన మధ్య అవతరించి, సుమారు 
౬౦ సంవత్సరాలు చిత్ర విచిత్రమైన చర్యలు చేస్తూ, విప్లవాత్మకమైన భావాలు వెలి బుచ్చుతూ ,
ఉత్తమ నైతిక విలువలు, వివేకము, వైరాగ్యము మనకు నేర్పుతూ, జీవిత లక్ష్యం విద్వేషం కాదు, వివేకము అని నొక్కిచెబు తు , ఇప్పటికి ప్రపంచపు సమస్యల గురించి ఆలోచించే ఎవరికైనా పరిష్కారము తమ అవతార కార్యం ద్వార అందిస్తున్నారు ఆ దివ్య మూర్తి షిర్డీ సాయి బాబా. 

                                                                                     ----(శాంతి ద్వీపం శిరిడి--మన్నవ సత్యం)

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి