16, ఏప్రిల్ 2012, సోమవారం

ఒక సులభమైన మార్గము ఉంది.

ఓం సాయి మాస్టర్!

పరమాత్మా సాయి మధుర వాక్కులు. 

మన హృదయ గుహలో సాయి ని పదిలముగా భద్రపరుచుకోవాలి. జీవితాంతము ఆయనను వదలకూడదు. 
మన పూర్వ జన్మ పుణ్యము వల్లనే మనము సాయి పదాల చెంత  చేరగాలిగాము. ఆ చరణాలు మనకు చిత్త  శాంతిని కలిగిస్తాయి. ప్రపంచ విషయాలలో నిశ్చింతను ప్రాప్తింప  చేస్తాయి. (స.చ. అ. 7 : 1-27)

     
మానవాళిలో ప్రేమ,  సహనము,  త్యాగము, నిస్కామకర్మ,  దానము మొదలైన సద్గుణాలు 
తమ సహజ గుణాలుగా నాటుకుపోవాలి. అలా మార్పుచెందించే ప్రక్రియ నిరంతరమూ జరుగుతూ 
ఉంచటానికి  ఒక సులభమైన మార్గము ఉంది.
అదే సాయిని నిరంతరమూ అందరు గుర్తుంచుకునేల చేయటము.

                                                                                                                         .......మన్నవ సత్యం.

''ఇదిగో !  ఆద్యాత్మిక భాండాగారపు తాళం చెవి. మీ చేతులలో పెడుతున్నాను. మీకు కావలసినంత తీసుకుపోండి.''
అని అతి సునాయాసమైన సాధనా మార్గము మనముందు ఆ దైవమె నిలిచి అందించిన అపూర్వ సంఘటన. 
షిరిడి సాయిబాబా  అవతరణ. 
                                                                                                                                 ------మన్నవ సత్యం. 

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి