9, ఏప్రిల్ 2012, సోమవారం

అందువల్ల మానవులను సద్గుణాలు కలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి.

ఓం సాయి మాస్టర్ !

పరమాత్మ సాయిబాబా మధుర వాక్కులు:

" సాయి సాయి అన్న నామస్మరణ సకల కలిమలాన్ని దహించి వేస్తుంది. 
నాకు చేసిన సాష్టాంగ దండ ప్రణామము, మీరు పలికి, విని  సంతరించుకున్న పాపాలనన్నిటిని
నాశనము చేస్తుంది."


సమాజములో సద్గుణాలు గల మానవుల సంఖ్య పెరిగే కొద్దీ
సమాజములో అశాంతి తగ్గుతూ వస్తుంది. ఎక్కువ మంది సద్గుణాలు అలవరచు కుంటూ ఉంటె 
సమాజములో అశాంతి కుడా ఇంకా ఇంకా తగ్గుతూ ఉంటుంది. 
అందువల్ల మానవులను సద్గుణాలు కలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి.   
పరమాత్మ షిర్డీ సాయిని నిరంతరమూ  మానవాళికి దగ్గరగా చేయగల ప్రక్రియ కుడా నిరంతరమూ
జరుగుతూనే ఉండాలి.

షిరిడి లో సాయి సమాధి మందిరములో చదరని అలౌకిక చిరునవ్వుతో బాబా చూచే చూపు లోంచి 
 ప్రవహించే ఆ మాధుర్యము, ఆ శాంతి ప్రేమా, సమాధి మందిరములో కూర్చుని అనుభవించిన ఆ ఆనందమయ 
క్షణాలు గుర్తుతెచ్చుకుంటే సాయి మీద భక్తీ ప్రేమ పెల్లుబుకుతాయి.  

                       (శాంతి ద్వీపం షిరిడి పుస్తకము నుండి)--మన్నవ సత్యం.


అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి