28, ఏప్రిల్ 2012, శనివారం

భూ మాత, మనము ఆమెను కాళ్ళతో తన్నినా, నాగళ్ళతో దున్నినా, మురికి మల మూత్రాలు పోస్తూ తనను అనేకరకాలుగా అవమానించినా , ఓరిమి ....

ఓం సాయి మాస్టర్ 

మానవులు షిర్డీ సాయి ని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటె సాయిబాబా లోని సద్గుణాలు మానవునిలో నాటుకుంటూ వుంటాయి. మానవుని ప్రవర్తన, నడవడిక, స్వభావము క్రమముగా మారుతూ ఉంటాయి. మానవాళి క్రమముగా బాబా వలె ప్రేమగా త్యాగిగా మారిపోతూ ఉంటారు. 
                                                                                                   -----మన్నవ సత్యం  


సాయి సచ్చరిత్ర అమృత వాక్కులు. 

'' సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాదు. ''


*  *  *

భూ మాత, మనము ఆమెను కాళ్ళతో తన్నినా, నాగళ్ళతో దున్నినా, మురికి మల మూత్రాలు పోస్తూ తనను అనేకరకాలుగా అవమానించినా , ఓరిమి వహించి మనము నిలబడటానికి చోటు మనుగడకు ఆహారము ఇచ్చే తల్లి భూమివలె , సాయి ఆ షిరిడి గ్రామస్తులు తనను, మహాల్సాపతి చేసినట్లు దైవంగా గౌరవించినా లేక బలభాటే వలె అవమానించినా ''ఓరిమి'' వహించి తన దినచర్య కొనసాగించే వారు.


                                                      ---(శాంతి ద్వీపం షిర్డీ--మన్నవ సత్యం) 

26, ఏప్రిల్ 2012, గురువారం

మానవుని మనస్సు ఎప్పుడు ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో, వారి గుణాలు మానవునిలో నాటుకుంటూ ఉంటాయి.

ఓం సాయి మాస్టర్  

మానవుని మనస్సు ఎప్పుడు ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో, వారి గుణాలు మానవునిలో నాటుకుంటూ ఉంటాయి.
అందుకే సకల సద్గుణ రాసి, సకల దైవగున సంపన్న్డు సాయిని తలచినంతసేపు ఆయనలోనే సద్గుణాలు మానవుని అంతఃకరణ లో  ప్రవేశిస్తూ ఉంటాయి.  
మానవాళిని మార్చడానికి ఇది ఏంటో సులభమైన మార్గము.
                                                                                                                                       -------మన్నవ సత్యం 


సాయి సత్చరిత్ర అమృత వాక్కులు.

''మనసు సారవంతమైన నేల. దానిని సాయి భక్తిజలం తో తడపాలి. అప్పుడు వైరాగ్యం అంకురిస్తుంది.  
జ్ఞానం వికసిస్తుంది. కైవల్యం అనే ఫలం లభిస్తుంది. బాబా వాక్యమే పారమానంద ప్రాప్తికి దారి  చూపిస్తింది. 
                                                                                                        (స.చ. అ: ౬ ఓవీలు: ౧-౪౦.)

ఒంటికి పొడుగైన లాల్చి,  తలకు గుడ్డ  కట్టుకుని ఒక దివ్యరూపము మన మధ్య అవతరించి, సుమారు 
౬౦ సంవత్సరాలు చిత్ర విచిత్రమైన చర్యలు చేస్తూ, విప్లవాత్మకమైన భావాలు వెలి బుచ్చుతూ ,
ఉత్తమ నైతిక విలువలు, వివేకము, వైరాగ్యము మనకు నేర్పుతూ, జీవిత లక్ష్యం విద్వేషం కాదు, వివేకము అని నొక్కిచెబు తు , ఇప్పటికి ప్రపంచపు సమస్యల గురించి ఆలోచించే ఎవరికైనా పరిష్కారము తమ అవతార కార్యం ద్వార అందిస్తున్నారు ఆ దివ్య మూర్తి షిర్డీ సాయి బాబా. 

                                                                                     ----(శాంతి ద్వీపం శిరిడి--మన్నవ సత్యం)

16, ఏప్రిల్ 2012, సోమవారం

ఒక సులభమైన మార్గము ఉంది.

ఓం సాయి మాస్టర్!

పరమాత్మా సాయి మధుర వాక్కులు. 

మన హృదయ గుహలో సాయి ని పదిలముగా భద్రపరుచుకోవాలి. జీవితాంతము ఆయనను వదలకూడదు. 
మన పూర్వ జన్మ పుణ్యము వల్లనే మనము సాయి పదాల చెంత  చేరగాలిగాము. ఆ చరణాలు మనకు చిత్త  శాంతిని కలిగిస్తాయి. ప్రపంచ విషయాలలో నిశ్చింతను ప్రాప్తింప  చేస్తాయి. (స.చ. అ. 7 : 1-27)

     
మానవాళిలో ప్రేమ,  సహనము,  త్యాగము, నిస్కామకర్మ,  దానము మొదలైన సద్గుణాలు 
తమ సహజ గుణాలుగా నాటుకుపోవాలి. అలా మార్పుచెందించే ప్రక్రియ నిరంతరమూ జరుగుతూ 
ఉంచటానికి  ఒక సులభమైన మార్గము ఉంది.
అదే సాయిని నిరంతరమూ అందరు గుర్తుంచుకునేల చేయటము.

                                                                                                                         .......మన్నవ సత్యం.

''ఇదిగో !  ఆద్యాత్మిక భాండాగారపు తాళం చెవి. మీ చేతులలో పెడుతున్నాను. మీకు కావలసినంత తీసుకుపోండి.''
అని అతి సునాయాసమైన సాధనా మార్గము మనముందు ఆ దైవమె నిలిచి అందించిన అపూర్వ సంఘటన. 
షిరిడి సాయిబాబా  అవతరణ. 
                                                                                                                                 ------మన్నవ సత్యం. 

15, ఏప్రిల్ 2012, ఆదివారం

అలా చేస్తే మానవులు సద్గునవంతులవుతారు.

ఓం సాయి మాస్టర్ 


పరమాత్మసాయి బాబా మధుర వాక్కులు.

''సదా దైవాన్నే ఉపసిస్తూ ఉండు. మరో దాని యందు మనసు పోనీయకు. నీ మనసు నా నామస్మరణలో లీనం కానీ''
                                                                                                                            .........(స. చ. అ 6 - 1 : 40)
అన్నారు సాయి. అలా చేస్తే బాబా లోని సద్గుణాలు మానవుల అంతఃకరణ లో ప్రవేసిస్తాయి. మానవులు సద్గునవంతులవుతారు.  మన దైవము బాబానే కదా. అందువల్ల మనము బాబా నే తలుహు కుందాము.
                                                                                                                                                  ---మన్నవ సత్యం.
10, ఏప్రిల్ 2012, మంగళవారం

ఇది అత్యంత ముఖ్య మైన విషయము. మనము పట్టించుకోవలసిన సంగతి.

ఓం సాయి మాస్టర్ !
శ్రీ సాయి సత్చరిత్ర మధుర వాక్యాలు : 

శ్రీ సాయి చరిత్ర అత్యంత విచిత్ర లీలలతో నిండి ఉంటుంది. 
వాటిని వింటే మన చెవులు, మన అంతఃకరణ పవిత్రమై పోతాయి. 
                                                            (అ.4 : 18-23)


మానవాళి సద్గుణాలు కలిగిఉంటే నే సమాజము సుఖ శాంతులతో ఉండగలుగుతుంది. 
అందరిని సద్గుణ వంతులు గా  చేయటము గురించి అందరు ఆలోచించాలి. 
ఇది అత్యంత ముఖ్య మైన విషయము. మనము పట్టించుకోవలసిన సంగతి. 

ఈ ప్రపంచపు సర్వ మానవాళికి ఆచరణ యోగ్యమైన స్పష్టమైన జీవన సూత్రం ఏమిటో, 
కష్టం నుండి దుఃఖము నుండి విముక్తి పొందటం ఎలాగో మనకు నేర్పేందుకు 
మన మధ్య అవతరించారు షిర్డీ సాయిబాబా. 

-----మన్నవ సత్యం.   

gmsgodman@gmail.com

9, ఏప్రిల్ 2012, సోమవారం

అందువల్ల మానవులను సద్గుణాలు కలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి.

ఓం సాయి మాస్టర్ !

పరమాత్మ సాయిబాబా మధుర వాక్కులు:

" సాయి సాయి అన్న నామస్మరణ సకల కలిమలాన్ని దహించి వేస్తుంది. 
నాకు చేసిన సాష్టాంగ దండ ప్రణామము, మీరు పలికి, విని  సంతరించుకున్న పాపాలనన్నిటిని
నాశనము చేస్తుంది."


సమాజములో సద్గుణాలు గల మానవుల సంఖ్య పెరిగే కొద్దీ
సమాజములో అశాంతి తగ్గుతూ వస్తుంది. ఎక్కువ మంది సద్గుణాలు అలవరచు కుంటూ ఉంటె 
సమాజములో అశాంతి కుడా ఇంకా ఇంకా తగ్గుతూ ఉంటుంది. 
అందువల్ల మానవులను సద్గుణాలు కలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి.   
పరమాత్మ షిర్డీ సాయిని నిరంతరమూ  మానవాళికి దగ్గరగా చేయగల ప్రక్రియ కుడా నిరంతరమూ
జరుగుతూనే ఉండాలి.

షిరిడి లో సాయి సమాధి మందిరములో చదరని అలౌకిక చిరునవ్వుతో బాబా చూచే చూపు లోంచి 
 ప్రవహించే ఆ మాధుర్యము, ఆ శాంతి ప్రేమా, సమాధి మందిరములో కూర్చుని అనుభవించిన ఆ ఆనందమయ 
క్షణాలు గుర్తుతెచ్చుకుంటే సాయి మీద భక్తీ ప్రేమ పెల్లుబుకుతాయి.  

                       (శాంతి ద్వీపం షిరిడి పుస్తకము నుండి)--మన్నవ సత్యం.


8, ఏప్రిల్ 2012, ఆదివారం

ఈ సృష్టిలో అత్యంత ప్రధాన మైన విషయాలు కుడా ఎంతో నిరాడంబరముగా, ఎంతో సామాన్యముగా ,

ఓం సాయి మాస్టర్ !

ప్రేమ శాంతి సహనం త్యాగం మొదలైన సద్గుణాల వల్ల మానవుడు వ్యక్తిగతంగా శాంతి గా ఉండగలుగు తాడు. 
అంతే గాక సమాజానికి హాని కలిగించక సుఖ శాంతులు పంచ గలుగు తాడు. 


నా లీలాకధలను అలా అలవోకగా విన్నా సరే, వారికి శాంతి ఆనందాలు ప్రసాదిస్తాను.అన్నారు సాయి. 
సాయిని సకల మానవాళికి దగ్గర చేయటము వల్ల మానవులలో శాంతి  ఆనందాలు ప్రేమ శాంతి సహనము నాటవచ్చు. 

ఈ సృష్టిలో అత్యంత ప్రధాన మైన విషయాలు కుడా ఎంతో నిరాడంబరముగా,  ఎంతో సామాన్యముగా ,
ఎంతో మామూలు విషయాలులా గా  జరిగిపోతూ ఉంట్గాయి. సాయి అవతరణ కుడా అంతే నిరాడంబరము గా జరిగింది

(శాంతి ద్వీపము షిరిడి పుస్తకమునుండి...మన్నవ సత్యం)

gmsgodman@gmail.com

జననానికి మరణానికి మధ్యగల జీవితము మన అధీనమా? ఇదీ ప్రశ్న.

ఓం సాయి మాస్టర్ 

మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మన పిల్లలను
 అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్లగలమా ! చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు.
సాయి బాబా ఉద్యమము పేజి చదవండి.

మనిషి జన్మిస్తాడు. మరల మరణిస్తాడు. ఇది జగమెరిగిన  సత్యం.   
ఈ మధ్యకాలంలోదంతా జీవితము.
ఈ జీవితమనేది  మనమనుకుంటున్నట్లు జన్మించటము మరల 
మర ణిoచటము లా  మనచేతుల్లో లేని విషయమా లేకపోతె 
జననానికి మరణానికి మధ్యగల జీవితము మన అధీనమా? ఇదీ ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానము అన్వే ణ్వే షి  స్తుపోయే  అన్వేషకులము మనమైతే 
మన అన్వేషణ ఫలితమే బాబా.
--- (శాంతి ద్వీపం షిరిడి పుస్తకమునుండి )మన్నవ సత్యం   

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

అలామంచి సమాజాన్ని నిర్మించవచ్చు.

ఓం సాయి మాస్టర్ !

మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మన పిల్లలను
 అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్లగలమా ! చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు.

సాయిబాబా ఉద్యమము పేజి చదవండి. 


నా నామము, నాయదల భక్తీ, నా లీలల సంపత్తి, నా గ్రంధము, నిత్యమూ నా ధ్యానము, ఎవరి హృదయము లో ఉంటాయో, వారిలో విషయ వాసనలు ఎలా కలుగుతాయి?
అన్నారు సాయి. విషయ వాసనలు అంటే దుర్గుణాలు. 
అందుకే  సాయిని అందరికి పరిచయము చేయడము ద్వారా మానవులలోని దుర్గుణాలు తిలగించ వచ్చు. 
అలామంచి సమాజాన్ని నిర్మించవచ్చు. 

                                                                   ----మన్నవ సత్యం 

బాబా చరిత్ర పుస్తకాలు మానవాళికి అందించడము ద్వారా బాబా పై భక్తీ ప్రేమలు ఏర్పరచవచ్చు.

ఓం సాయి మాస్టర్ 

సాయి బాబా ఉద్యమము పేజి చదవండి.

పరమాత్మ షిరిడి సాయిబాబా మధుర వాక్కులు. 

నా కధలను శ్రవణం చేస్తే, కీర్తన రూపం లో నా కధలను అందరికి కధనం చేస్తే, నా కధలను మననము ధ్యానము చేస్తే,
నాయడల భక్తి ప్రేమలు అందరికి ఏర్పడతాయి. అన్నారు సాయి.
బాబా చరిత్ర పుస్తకాలు మానవాళికి అందించడము ద్వారా బాబా పై భక్తీ ప్రేమలు ఏర్పరచవచ్చు. 

                                                     ----మన్నవ సత్యం.

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి