22, జులై 2011, శుక్రవారంసాక్షాత్ పరమాత్మ షిరిది సాయి బాబా వారికి నమస్కారములు.


పరమాత్మ శిరిడి సాయిబాబా ఉవాచ :

"అల్లా మాలిక్" అంటే భగవంతుడే సర్వాధికారి. ఆ భగవంతుడు తప్ప మనల్ని ఇంకెవ్వరూ కాపాడే వారు లేరు. వారి ఇచ్చానుసారమే మనము నడుద్దాము. వారు మన కోరికలు నెరవేరుస్తారు. మనకు ఒక దారి చూపుతారు.
*
పరమాత్మ షిరిడి సాయిబాబా మెచ్చిన గ్రంధము
ఏకనాధ భాగవతము నుండి :

సాధు జనులు దీనులపై నిజమైన దయను చూపిస్తారు.
మహా జ్ఞాని అయిన వేద వ్యాసుల  వారికి బ్రహ్మోపదేశము చెసిన నారద మహర్షి ఏమే తెలియని పసివాడు ధ్రువుడికి కూడా మార్గదర్సకత్వం చేసారు.
పరమ మూర్ఘుడైన  దొంగకు  రామ నామాన్ని ఉపదేశించి వాల్మీకిని చేసారు.    
*    
సికింద్రాబాద్, న్యూ వాసవి నగర్ నుండి ఛి. అమరావాని , 
" మీ పుస్తకము రోజు చదువుతున్నాను. చాల బాగుంది. మరికోన్నిపుస్తాకాలు మిత్రులకు ఇవ్వటానికి కావలి. పంపమని కోరుచున్నాను " అని వ్రాసారు. 

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి