27, నవంబర్ 2011, ఆదివారం

ఓం సాయి మాస్టర్
పరమాత్మా షిర్డీ సాయిబాబా వారికి ప్రణామములు !


ప్రార్ధన

ఓం ఆద్యంత రహితా సాయిబాబా నమస్కారములు నమస్కారములు !
(ఈ నామమును 19 సార్లకు తక్కువ కాకుండా ఇప్పుడే స్మరించండి)
*

సాయిబాబా ఉవాచ 

" నేనే దైవం. నేను షిర్డీ లొనూ సర్వర్త్ర ఉంటాను. "

*

ఈ సాయి లోకం లోకి వచ్చిన వారికి నమస్సులు. 
మనలనందరికి చల్లగా చూడమని బాబాను ప్రార్ధిస్తున్నాను.
బాబా స్వయం గా చెప్పారు తను దైవం అని. 
దైవం అంటే అందరికి త్రండ్రి తల్లి కుడా.
తల్లికున్న ప్రేమతో తండ్రికున్న బాధ్యతతో బాబా మనలను తీర్చి దిద్దుతారు.
మనము కుఉడా తండ్రికి తగిన బిడ్డలవలె avudaamu.
  సాయి smaranalo
మన్నవ సత్యం


 ఈ పాకెట్ బుక్ రూ.౩౦ మాత్రమె.
మీ చిరునామా తెలిపితే ఒక్క పుస్తకము మాత్రము బహుమతిగా పంపగలను.

gmsgodman@gmail.com

26, నవంబర్ 2011, శనివారం

ఓం సాయి మాస్టర్ 
పరమాత్మా షిరిడి సాయిబాబా వారికి నమస్కారములు


ప్రార్ధన

(2 ) ఓం పరబ్రహ్మ మూర్తి సాయిబాబా నమస్కారములు నమస్కారములు.

( ఈ నామమును ఇప్పుడే 19  సార్లకు తక్కువ కాకుండా స్మరించండి)

*
సాయిబాబా ఉవాచ

" నీను భగవంతుని బానిసను. ఆయనే యజమాని " 
*
ఈ  సాయి లోకం లోకి వచ్చిన మీకు ప్రణామములు.
బాబా చెప్పిన ఈ సూక్తి చదివినప్పుడు పరమాత్మ బాబానే అంత నిరహన్కారంగా ఉన్నప్పుడు ఇంకా మనమెంత నిరహన్కారముగా ఉండాలి అనిపిస్తున్నది. 
బాబా హేమడ్పంతుతో  అహంకారాని పక్కనపెట్టమని అప్పు డు తానె అతనిలో ప్రవేశించి 
తన చరిత్రను తానె వ్రాసు కుంటాను   అన్నారు. అంటే మనలోని అహంకారాన్ని ఎంతమటుకు మనము తగ్గించుకున్తామో అంతమేరకు మనలో సాయి  దివ్య శక్తి  ప్రవేశిస్తుంది.అప్పుడు మనము  శాంతి ఆరోగ్యము పొందగలము.

సాయిని స్మరిస్తూ
మన్నవ సత్యం 

ఈ పాకెట్ బుక్ రూ.30   
మీ  చిరునామా పంపితే ఒక్క పుస్తకము మాత్రము బహుమతిగా పంపగలను.

gmsgodman@gmail.com

25, నవంబర్ 2011, శుక్రవారం

ఓం సాయి మాస్టర్ 
పరమాత్మ షిర్డీ సాయిబాబా వారికి నమస్కారములు. 

ప్రార్ధన

ఓం సచ్చిదానంద మూర్తి సాయిబాబా నమస్కారములు నమస్కారములు !

( ఇప్పుడే ఈ నామాన్ని ౧౯ సార్లకు తక్కువలేకుండా స్మరించండి)

బాబా! మీరు అనుభవిస్తున్న ఆ సచ్చిదానందము ఏదైతే ఉన్నదో ఆ సచ్చిదానందాన్ని ఎపతికైన మేము కూడా అనుభవించేటట్లు అనుగ్రహించు బాబా!


21, నవంబర్ 2011, సోమవారం

సాయి లోకం లోకి ఆహ్వానము !

ఓం సాయి మాస్టర్ !

సందర్సకులారా ! ప్రేమ పూర్వక నమస్కారములు !
మనలనందరినీ అనుగ్రహించామనీ సుఖ సంతోషాలతో మనమందరమూ ఉండేటట్లు ఆశీర్వదించమని 
బాబా ను ప్రార్ధించాను. 


సాయి ఇలా చెప్పారు 

" నా  నుంచి  నా  వాడిని  దూరమేనాటికీ  కానివ్వను ! "  
*
ఇంతకంటే అనుగ్రహం ఇంకేం కావాలి ! 
చెప్పండి.


దర్శకులకు ప్రణామములతో 
మన్నవ సత్యం 

19, నవంబర్ 2011, శనివారం

ఓం సాయి మాస్టర్ 

సాయి బాబా  ఉవాచా :

"  భగవంతుడే సర్వాధికారి ఆ భగవంతుడు తప్ప మనలను ఇంకెవ్వరు కాపాడే వారు లేరు. వారి ఇచ్చానుసారము  మనము నడుద్దాము. వారు మన కోరికలు నెరవేరుస్తారు.
మనకు ఒక దారి చూపుతారు. " 
అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి