28, జులై 2011, గురువారం

సాయిలోకం లోకి స్వాగతం

సాయిలోకం లోకి స్వాగతం

ఓం సాయి మాస్టర్ !
పరమాత్మా షిర్డీ సాయిబాబా వారికి నమస్కారములు.


సాయి బాబా ఉవాచ :

ఈ సంసారము లోని  సంతోషము విచారము సత్యమైనవి కావు. జనన మరణ చక్రంలో పరిభ్రమించటమే దుఃఖము .
దానినుండి విముక్తి పొందడమే నిజమైన ఆనందము . 

          pocket book
gmsgodman@gmail.com

24, జులై 2011, ఆదివారం

సాయి లోకం లోనికి ఆహ్వానము

సాయి లోకం లోనికి ఆహ్వానము 
*
*
ఓం సాయి మాస్టర్ !
పరమాత్మా షిర్డీ సాయి బాబా వారికి నమస్కారములు !
*
*

షిర్డీ సాయి బాబా ఉవాచ :

మనముందు రెండు మార్గాలున్నాయి. మొదటిది శ్రేయస్సు  నిస్తుంది.  రెండవది  సుఖాన్నిస్తుంది. 
మొదతుడు ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినది. రెండవది ప్రాపంచిక విషయాలకు సంబంధించినది. 
తెలివిగలవాడు మొదటి బాట ను  బుద్ధి తక్కువవాడు రెండవ దానినీ కోరుకుంటాడు. 
*
*
భక్త కబీరు ఉవాచ :

తండ్రి! నా అవగుణంబుల తలచకుండ
నన్ను మన్నించు దీన బాంధవ కృపాళో
నే  నయోగ్య  పుత్రుడవైన నీవు పితవు 
నీవు పితృ గౌరవంబును నిలుపుకోనుము!

ఆదిలోన మధ్యమందు , అంతమునను 
స్వామి ఒక్కడే నిలుచు సహచరుండు 
వాని తోడు వీడ, వాని దాసుడా నేను 
అని కబీరు మనకు తనను తెలిపె
*
*


22, జులై 2011, శుక్రవారంసాక్షాత్ పరమాత్మ షిరిది సాయి బాబా వారికి నమస్కారములు.


పరమాత్మ శిరిడి సాయిబాబా ఉవాచ :

"అల్లా మాలిక్" అంటే భగవంతుడే సర్వాధికారి. ఆ భగవంతుడు తప్ప మనల్ని ఇంకెవ్వరూ కాపాడే వారు లేరు. వారి ఇచ్చానుసారమే మనము నడుద్దాము. వారు మన కోరికలు నెరవేరుస్తారు. మనకు ఒక దారి చూపుతారు.
*
పరమాత్మ షిరిడి సాయిబాబా మెచ్చిన గ్రంధము
ఏకనాధ భాగవతము నుండి :

సాధు జనులు దీనులపై నిజమైన దయను చూపిస్తారు.
మహా జ్ఞాని అయిన వేద వ్యాసుల  వారికి బ్రహ్మోపదేశము చెసిన నారద మహర్షి ఏమే తెలియని పసివాడు ధ్రువుడికి కూడా మార్గదర్సకత్వం చేసారు.
పరమ మూర్ఘుడైన  దొంగకు  రామ నామాన్ని ఉపదేశించి వాల్మీకిని చేసారు.    
*    
సికింద్రాబాద్, న్యూ వాసవి నగర్ నుండి ఛి. అమరావాని , 
" మీ పుస్తకము రోజు చదువుతున్నాను. చాల బాగుంది. మరికోన్నిపుస్తాకాలు మిత్రులకు ఇవ్వటానికి కావలి. పంపమని కోరుచున్నాను " అని వ్రాసారు. 

21, జులై 2011, గురువారం

WELCOME TO SAILOKAM

పరమాత్మా షిర్డీ సాయి బాబా వారికి నమస్కారములు !. 
సాయి బాబా ఉవాచ 
రుణానుబంధం వలన మనమిప్పుడు ఇలా కలిసాము.
ఒకరిపట్ల ఒకరము ప్రేమ వహించి అన్యోన్యంగాను సుఖం గాను 
సంతోషం గాను ఉందాము. 
*
ఆది శంకరాచార్య ఉవాచ
వివేక చూడామణి 

మనిషిగా జన్మించడము 
ముక్తికావాలనే తీవ్ర కాంక్ష 
జ్ఞాన స్వరూపులైన మహాత్ముని మనస్పూర్తిగా ఆరాధించ గలగడము 
ఈ మూడూ ఎంతో  అరుదుగా లభిస్తాయి.
ఈ మూడు ఎక్కడ ఉన్న అవి భగవదనుగ్రహం వల్ల లభించినట్లే. 

సాయి లోకం లోకి ఆహ్వానము.

సాయి లోకం లోకి  ఆహ్వానము.  

పరమాత్మా షిర్డీ సాయి బాబా వారికి నమస్కారములు !. నిత్యుడై సత్యుడై నిలచి యున్న సాయిని
నిండు మనసుతో కొలిచిన వరములిచ్చు సాయిని
సర్వ ధర్మములు తానుగ  రూపుదాల్చు సాయిని
తరుగులేని ఆనందమె తానె అయిన సాయిని
హ్రుదయమంత సాయినే నింపుకొనగ తలచితిని
మనసారా సాయినే మనన చేయ నెంచితిని
షోడ శోపచారములతో పూజ చేయ తలచి నేను
అంతా నిండిన సాయిని ఆహ్వానిస్తున్నాను 19, జులై 2011, మంగళవారం

om sai master
సాక్షాత్ పరమాత్మ షిర్ది సాయి బాబా వారికి సాస్టాంగ నమస్కారములు.


నిత్యుడై సత్యుడై నిలచి యున్న సాయిని
నిండు మనసుతో కొలిచిన వరములిచ్చు సాయిని
సర్వ ధర్మములు తానుగ రూపుదాల్చు సాయిని
తరుగులేని ఆనందమె తానె అయిన సాయిని
హ్రుదయమంత సాయినే నింపుకొనగ తలచితిని
మనసారా సాయినే మనన చేయ నెంచితిని

18, జులై 2011, సోమవారం

om sai master
సాక్షాత్ పరమాత్మ షిర్ది సాయి బాబా వారికి సాస్టాంగ నమస్కారములు.సర్వ ధర్మములు తానుగ రూపుదాల్చు సాయిని
తరుగులేని ఆనందమె తానె అయిన సాయిని

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి