6, నవంబర్ 2010, శనివారం

sailokam 06/11/2010

FOLLOW బటన్ నొక్కండి
ఈరోజు నేను ఉదయము ౧౦.౩౦ నుండి ఈపూరుపాలెం పూజ గదిలో సాయి కి  పంచోపచార పూజ, నామావళి చదివాను , ఒక   అధ్యాయము సాయి చరిత్ర పారాయణ చేశాను.  సత్సంగ సభ్యులతో షిరి వెళ్ళిన అనుభవాలు చెప్పుకున్నాను.  
మనలనందరి కి మేలు  చేయమని పరమాత్మ సాయి ని వేడుకున్నాను. 
ఓం 
పరమాత్మ సాయి బాబా వారికి నమస్కారములు. 
సాయి నామము

ఓం అగణిత గుణాయ సాయినాధాయ  నమః 

పరమాత్మ సాయి సూక్తి
ఎవ రెవరిని కోప్పడ్డ  నన్ను బాధ పెట్టిన వారవుతారు.  ఒకరినొకరు దూషిస్తే నేను చాల బాధ పడతాను.
 ఎవడు ధైర్యంగా నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఆనందం కలిగిస్తాడు. 

గురు భరద్వాజ బోధ 
శ్రీ సాయి చరిత్రను శ్రధగా పారాయణ చేస్తే అందులోని భక్తుల అనుభవాలు  క్రమముగా అన్ని రూపాలు సకల దేవతా స్వరూపి ఐన సాయి గా అవతరించిన భగవంతుడేనన్న గుర్తింపును కలిగిస్తాయి. 

నామాట 
 భగవంతుడు మనకు రోజులో ౨౪ గంటల సమయము ఇట్చారు. అందులో ౨౩ గంటల కాలమీ మనది.  ఆ ఒక్క గంట సమయము బాబా వారిది.  ఆ గంటసేపు మనము బాబాకు  కేటాయించక పోతె మిగత ౨౩ గంటలు కూడా వ్యర్ధము అ వు తా య్. ఆ ౧ గంట బాబా స్మరణలో గడిపితే ౨౪ గంటలు సార్ధకమవుతాయి .

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి