29, అక్టోబర్ 2010, శుక్రవారం

SAILOKAM - Oct./29/10 FRIDAY

ఓం 
 పరమాత్మ షిర్డీ సాయిబాబా వారికి  నమస్కారములు !

సాయి నామము :
ఓం అఖిల వస్తు విస్తారాయ సాయి నాదాయ నమః

సాయి సూక్తి :
" దైవము నీకు కావలసినంత ఇస్తారు !అంతా మంచే  చేస్తారు !"

సత్సంగము .
ప్రేమ పూర్వక నమస్కారములు. 
సాయి రామ్!  బాగుంది . అంతా బాగుంది . అన్దరూ చాల  హ్యాపీ గ  వున్నారు కదా. 
ఎందుకంటే బాబా పండుగ విజయదసమి బాగా చేసుకున్నాము! పూజలు ఊరేగింపులు దివ్యమైన బాబా ప్రసాదాలు ! ఎంతో సంతోషంగా   గద !  గురు భరద్వాజ మాస్టర్ గారు ఎప్పుడు అనేవారు . ఈ కాలంలో పుట్టిన మనం ఎంతో  అదృష్టవంతులం అని. ఎందుకంటే బాబా అవతరించిన ఆయన పరిపాలిస్తున్న ఈ సమయం లో మనము ఉండటము , ఆయన నివసించిన షిర్డీ గ్రామము లో అడుగు పెట్టటము ,  ఆయన ౬౦ ఏళ్ళు నివాసమున్న ద్వారకామాయి లో మనము కుర్చోగలగడము, బాబాను ప్రత్య క్ష ము గ  సేవించిన భక్తులను దర్శించ గలగడము ఇవన్ని మనము చేసుకోగలుగుతున్నాము . షిర్డీ  సాయి  బాబా మహారాజ్ అంటే ఎవరు అనుకుంటున్నారు . ఆయన  పరమాత్మ. భూమి పై మనకోసం  కేవలం మనకోసమే అవతరించిన దైవము. ఆయన ప్రభావము అపారముగా వ్యాపించి ఉన్న  ఈ రోజులలో మనము  జీవించి ఉండడము పూర్వ పుణ్యము.  ఈ అవకాసమును  సక్రమము గా  ఉపయోగించుకున్న వారు ధన్యులు అని  గురు భరద్వాజ  మాస్టర్ గారు అన్నారు. ఈ విలువ మనకు తెలియ జేసి  మనలను సాయి వైపు మళ్ళించ డానికి చేయ వలసిన ప్రయత్నమంతా  చేసారు . సఫలికృత మయ్యారు కుడా! 

SAILOKAM - Oct./28/2010 - GURUVARAM

ఓం సాయి !
పరమాత్మ సాయి  బాబా  నమస్కారములు !

ఈరోజు సాయి నామము: 
ఓం అఖిల జీవ వత్సలాయ సాయి నాధాయ నమః !
నేటి బాబా సూక్తి :

"దైవమే అందరికి యజమాని !"
సత్సంగము :
ఓం సాయి మాస్టర్ ! ఈరోజు  ఇలా సత్సంగము చేసుకోగాలుగుతున్నమంటే  అదంతా  ఆ  సద్గురు మూర్తుల కృప !  వారి కృప మన మీద ప్రసరిస్తుండ బట్టి  మనము  ఇలా సత్సంగము చేసుకో గలుగు తున్నాము.  అందువలన మరొక్కసారి  ఆ సద్గురు మూర్తులను  మనసార స్మరించు కుందాము !
సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్ కి జై ! సద్గురు భరద్వాజ మహారాజ్ కి జై ! గురుదేవ దత్త కి జై ! ద్వారకామాయి కి జై !అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి